బర్కత్పుర డివిజన్ కార్పొరేటర్ అరెస్ట్ | Barkatpura division corporator Diddi Rambabu arrested by Narayanaguda police | Sakshi
Sakshi News home page

బర్కత్పుర డివిజన్ కార్పొరేటర్ అరెస్ట్

Published Fri, May 2 2014 11:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

Barkatpura division corporator Diddi Rambabu arrested by Narayanaguda police

అలిండియా సుపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు, బర్కత్పుర కార్పోరేటర్ దిడ్డి రాంబాబును శుక్రవారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని నారాయణగూడ పోలీసు స్టేషన్కు తరలించారు. గత నెల 30న తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల నేపథ్యంలో బర్కత్పురలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

 

అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. అ క్రమంలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి దిగారు. దాంతో బీజేపీ నాయకులు అదే రోజు నారాయణ గూడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా దిడ్డి రాంబాబును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement