వెంకట్రామిరెడ్డిని విచారించిన సీబీఐ | CBI interrogation to T. Venkatram Reddy | Sakshi
Sakshi News home page

వెంకట్రామిరెడ్డిని విచారించిన సీబీఐ

Published Fri, Feb 27 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డిని గురువారం సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

హైదరాబాద్: చంచల్‌గూడ  జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డిని గురువారం సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.  రుణాల పేరుతో కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనను ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకుని విచారణ నిమిత్తం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం సాయంత్రం 5.30 గంటలకు జైలుకు తరలించారు. ఇదే కేసులో ఉన్న వినాయక్ రవిరెడ్డిని మాత్రం సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకోలేదు.

Advertisement

పోల్

Advertisement