ప్రపంచ దేశాలకు మన పట్టు
సెంట్రల్ సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతయ్యప్ప
హైదరాబాద్: ప్రపంచ దేశాలకు మన దేశ పట్టును పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సెంట్రల్ సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతయ్యప్ప అన్నారు. రాజేంద్రనగర్‌లో సోమవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ఎక్కువ శాతం చైనా నుంచి పట్టు దిగుమతి అవుతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో భారత్ నుంచే చైనాకు పట్టును ఎగుమతి చేయనున్నామన్నారు.
పట్టు పరిశ్రమ ఏర్పాటుకు ఉచిత శిక్ష ణనిస్తున్నామని, పట్టు దారం తీసే యంత్రాలను ఎస్సీ, ఎస్టీలకు 90% సబ్సిడీ తో అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిల్క్ బోర్డు సంయుక్త సంచాలకుడు శ్రీకాంత్, రాష్ట్ర సంచాలకుడు మదన్‌మోహన్ పాల్గొన్నారు.