పెళ్లి పేరుతో ఎర | Cheating in the name of marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో ఎర

Published Sat, Sep 19 2015 4:29 AM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

పెళ్లి పేరుతో ఎర - Sakshi

పెళ్లి పేరుతో ఎర

గిఫ్ట్ పార్శిల్ పంపిస్తామని రూ. లక్షలు స్వాహా
నైజీరియన్ ముఠా గుట్టు రట్టు

 
 నాంపల్లి :   మ్యాట్రీమోని పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ ముఠా ఆటకట్టించారు నగర సీసీఎస్ పోలీసులు. శుక్రవారం సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ బి.అనురాధ, ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం..  తార్నాకలో ఉండే మహిళ (54) రెండో వివాహం కోసం భారత్ మ్యాట్రీమోనీ. కామ్‌లో భాగస్వామి కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంది. అందులో కనిపించిన చంద్రన్ డేవిడ్ పటేల్ అనే వ్యక్తి ఫొటోకు లైక్ కొట్టింది. ఇద్దరూ ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.

ఆ మహిళ అతడి ప్రొఫైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుంది. వయస్సు 51 ఏళ్లు. మియామి ప్లోరిడాలో ఆపరేషన్ మేనేజర్‌గా పని చేస్తున్నట్టు ఉంది. ప్రొఫైల్ చూసి సంబరపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందు ఒక గిఫ్ట్(బహుమతి) పార్శిల్ పంపుతున్నానని, అందులో విలువైన ఆభరణాలై బంగారం గొలుసు, ఉంగరం, రూ.40 వేల డాలర్లు ఉన్నాయని డేవిడ్ ఆమెకు చెప్పాడు. మరుసటి రోజు తార్నాకలోని గ్లోబల్ సెక్యూరిటీస్ సంస్థ నుంచి  మాట్లాడుతున్నానని ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు.

గిఫ్ట్ పార్శిల్ ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరుకుందని, ఇది మీకు చేరాలంటే కస్టమ్స్ సుంకం, ఆదాయపు పన్ను కట్టాలన్నాడు. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.15 లక్షల 60 వేలు వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. మరో రూ. 2.5 లక్షలు చెల్లిస్తేగాని గిఫ్ట్ పార్శిల్ మీకు చేరదని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా తనతో చాటింగ్ చేసిన వ్యక్తి మోసగాడని తెలిసింది.  బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఈ మోసాలకు పాల్పడున్నది నైజీరియాకు చెందిన ఇక్‌బుటే కింగ్‌స్లే ఉచికా అలియాస్ టోనీ, అతడని సోదరుడు ఇక్‌బుటే జుడే నవాబులర్ అని తేలింది. 

బిజినెస్, స్టూడెంట్ వీసాలపై ఢిల్లీకి చేరుకున్న వీరిద్దరూ భారత్ మ్యాట్రిమనీ.కామ్‌లో ఇతరుల ఫొటోలు, ఫేక్ బయోడేటాలు అప్‌లోడ్ చూస్తూ అమాయకులను వివాహం పేరుతో మోసం చేస్తున్నారు. వివిధ బ్యాంకుల్లో వేరే వారి పేరుతో 8 అకౌంట్లు తెరిపిస్తున్నారు. తాము వల వేసిన వారు గిఫ్ట్ ట్యాక్స్ కోసం ఆ అకౌంట్లలో   డబ్బు వేసేలా చేస్తున్నారు. తర్వాత  ఆ డబ్బు డ్రా చేసి ఇచ్చిన వారికి కొంత కమీషన్ ఇస్తున్నారు. రాహుల్ పాండే పేరుతో తెరిచిన అకౌంట్‌లో 12 రోజుల్లోనే రూ.44 లక్షలు, నిఖిల్ శర్మ పేరుతో తెరి చిన   అకౌంట్‌లో నెల రోజుల్లో రూ.50 లక్షల లావాదేవీలు జరిగాయి. బ్యాంకుల ద్వారా సేకరించిన ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

మరో 9 మంది పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారిలో ఇక్‌బుటే కింగ్స్‌లే ఉచికా, ఇక్‌బుటే జుడేతో పాటుగా బ్రోకర్లు సంతోష్ కుమార్, దీరేందర్ కుమా ర్ అలియాస్ ధనుష్ అలియాస్ రాహుల్ పాండే ఉన్నారు. వీరిని సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, రూ.1,38, 000 వేల నగదు, 350 యూఎస్ డాలర్లు, 10 సెల్‌ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement