అఫ్జల్‌గంజ్:ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల జలాలు కలుషితం కాకూడదన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన 111జీవోను రద్దు చేసేందుకు యత్నిస్తే ప్రతిఘటిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంపై ప్రజల తరపున ఆందోళన చేస్తామన్నారు. జీవో అమలు చేస్తే కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్ అంధకారం కాక తప్పదని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 111జీవోను రద్దు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ జీవో జారీ అయిందని, దీనిపై సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల జలాలు కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. ఈ జీవో రద్దు వెనుక రియల్టర్ మాఫియా హస్తం ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమన్నారు.
రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో రైతులు, పంటలు ఎండిపోయి కరువు పరిస్థితులతో అల్లాడుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా కనీసం కరువు ప్రాంతాలుగా కూడా ప్రకటించకుండా వేల కోట్లు వెచ్చించి ఆకాశ హర్మాలను నిర్మిస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.17వేల కోట్ల లోటు బడ్జెట్ ఉండగా ముఖ్యమంత్రి మాత్రం రూ.30వేల కోట్లతో ఆకాశ హర్మాలను నిర్మిస్తామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం సొంత జిల్లాలో 500ల గ్రామాలు కాలుష్య పూరితంగా మారినా పట్టించుకోవడంలేని విమర్శించారు.
జీవో 111ను రద్దు చేస్తే ప్రతిఘటిస్తాం: నాగం
Published Tue, Nov 18 2014 1:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM
Advertisement
Advertisement