మేల్కొనకుంటే రాష్ట్రం ఎడారే! | CM KCR comments on Harithaharam | Sakshi
Sakshi News home page

మేల్కొనకుంటే రాష్ట్రం ఎడారే!

Published Fri, Dec 30 2016 3:00 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

మేల్కొనకుంటే రాష్ట్రం ఎడారే! - Sakshi

మేల్కొనకుంటే రాష్ట్రం ఎడారే!

అటవీ విస్తీర్ణం బాగా తగ్గి, ప్రమాదం పొంచి ఉంది: సీఎం కేసీఆర్‌

- దాన్ని నివారించేందుకే హరితహారం చేపట్టాం.. ప్రపంచంలోనే ఇది మూడో అతిపెద్ద హరిత ఉద్యమం
- అందరూ పాల్గొని విజయవంతం చేయాలి
- త్వరలో అఖిలపక్ష భేటీ..
- శాసనసభ స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి వెల్లడి  

పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గొప్ప ప్రయత్నాల్లో తెలంగాణ హరితహారం మూడో పెద్ద మానవ ప్రయత్నం. మొదట చైనాలోని గోబీ ఎడారి విస్తరణను నియంత్రించేందుకు 4,500 కి.మీ. పొడవునా మొక్కలు నాటారు. తరువాత బ్రెజిల్‌లో అమెజాన్‌ నదీతీరంలోని అడవుల సంరక్షణకు వంద కోట్ల మొక్కలు నాటారు.
– సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. మనం వెంటనే మేల్కొనకపోతే తెలంగాణలో చాలాభాగం ఎడారిగా మారే ప్రమాదముంది. ఆ దుస్థితి రాకుండా ఉండా లంటే ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిందే. ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటేనే అది సాధ్యం. అందు కే ప్రతి ఒక్కరినీ చేతులెత్తి కోరుతున్నా... హరితహారానికి సహకరించండి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపు నిచ్చారు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు అను సరించే వ్యూహాలపై చర్చించేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని స్పీకర్‌ మధుసూద నాచారిని కోరారు. గురువారం శాసనసభలో హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధాన మిచ్చారు. రాష్ట్రం లో అడవుల పరిస్థితి, మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిం చారు. 33 శాతం పచ్చదనం ఉంటేనే ప్రకృతి సమతౌల్యం సాధ్యమన్న సీఎం.. వివిధ దేశా ల పరిస్థితినీ సభలో ఉదహరించారు. సగటు న భూమ్మీద ప్రతీ మనిషికి 422 చొప్పున చెట్లున్నట్టు అంచనా వేశారని తెలిపారు. ఇక మన రాష్ట్రంలో 26,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉందన్నారు.  

గొప్ప ప్రయత్నం చేస్తున్నాం..
పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గొప్ప ప్రయత్నాల్లో తెలంగాణ హరిత హారం మూడో పెద్ద మానవ ప్రయత్నమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణలో హరితహారంతో 230 కోట్ల మొక్కలు నాటే పని మొదలైందని చెప్పారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలన్నది తమ లక్ష్యమన్నారు. 120 కోట్ల మొక్కలను గ్రామాలు, పట్టణాల్లోని బాటల వెంట, ఖాళీ ప్రదేశాల్లో, చెరువులు, కాలువ, పొలాల గట్ల మీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగ ణాలలో, కాలనీలలో నాటుతున్నారని చెప్పా రు. ఇక తెలంగాణలో గతంలో 28 ఫారెస్టు డివిజన్లుంటే 37కు పెంచామన్నారు. రేంజ్‌ల ను 106 నుంచి 185కు, సెక్షన్లను 469 నుంచి 831కు, బీట్లను 1,428 నుంచి 3,132కు పెం చామని సీఎం తెలిపారు. అటవీశాఖలో కొత్తగా 2,014 పోస్టులను భర్తీ చేశామని, 67 రేంజ్‌ ఆఫీసర్, 90 సెక్షన్‌ ఆఫీసర్, 1,857 బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు, మరో 44 ఇతర పోస్టులు అదనంగా మంజూరు చేశామని చెప్పారు. వాహనాలసంఖ్యనూ పెంచామన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరి«ధిలోని అటవీ అధికారులతో మాట్లా డి నియోజకవర్గ నిధులను కేటాయించి, అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

సభ తరఫున అభినందనలు
హరితహారంలో బాగా కృషి చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి సభ తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. మొక్కల పెంపకానికి కృషి చేసిన వారికి ఉత్తమ అవార్డు కింద రూ.లక్ష ఇస్తున్నామని.. అదే సంస్థ అయితే రూ. 2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలం, ఉత్తమ జిల్లా పరిషత్తుకు రూ. 2 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నామని.. ఉత్తమ నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇస్తున్నామని వివరించారు. హరితహారం కార్యక్రమం లేకముందే ఆయన మొక్కల పెంపకంతో తమ పాఠశాలను పచ్చగా మా ర్చారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా గద్వాల జిల్లా గట్టు మండలం లోని ఆలూరు గ్రామం ఎంపికైందన్నారు.

సీఎం నాటిన మొక్కలకు రక్షణుంటే చాలా?: చింతల
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ నాటిన కదంబం మొక్క రక్షణ కోసం అధికారులు చుట్టూ కంచె వేసి తాళం కూడా ఏర్పాటు చేశారని... మరి రాష్ట్రంలో మిగతా మొక్కలకు రక్షణేదని బీజేపీ సభ్యుడు చింతల రామచం ద్రారెడ్డి ప్రశ్నించారు. జార్ఖండ్‌ తరహాలో పళ్ల మొక్కలు నాటాలని, విరివిగా మొక్కలు పెంచిన పంచాయతీలకు పన్నుల్లో రాయితీ ఇవ్వాలని కోరారు. బాగా మొక్కలు నాటిన విద్యార్థులు, ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి సూచిం చారు. ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా పొందే ఆదాయంతో అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు మొక్కల పెంపకం కోసం ప్రత్యేకంగా హరిత హారం బడ్జెట్‌ కేటాయించాలని మజ్లిస్‌ ఎమ్మె ల్యే జాఫర్‌ హుస్సేన్‌ కోరారు. మొక్కలు నాటితేనే ఇళ్ల నిర్మాణాలకు అనుమతివ్వాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

భారీగా నిధులిస్తున్నాం..
ఉమ్మడి రాష్ట్రంలో మొత్తంగా అడవుల సంరక్షణ, పునరుద్ధరణ, మొక్కల పెంపకం కోసం ఏటా సగటున ఖర్చు పెట్టింది కేవలం రూ.13 కోట్లు మాత్రమేనని... గత 34 ఏళ్లలో తెలంగాణలో నాటిన మొక్కల సంఖ్య 35.3 కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అదే తాము గత రెండున్నరేళ్లలోనే 47.98 కోట్ల మొక్కలు నాటామని.. 4.31 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్‌ జరిగిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక రూ.1,243 కోట్లను అటవీశాఖకు  కేటాయించామన్నారు. అడవులు తగ్గిపోవడం తో ఆహారం కోసం జంతువులు జనావాసా లపై పడుతున్నాయని. ఇప్పుడు కోతుల బెడదకు అదే కారణమని వివరించారు.

సీఎం చెప్పిన కోతులు.. కొండెంగ కథ!
సూర్యాపేటలో జరిగిన సంఘటనను సీఎం పిట్టకథగా వివరించారు. ‘‘విప్లవ ఉద్యమాల నేల అయిన సూర్యాపేటలోని ఓ ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. అవి ఇళ్లపై దాడులు చేస్తున్నాయి. దాంతో అక్కడి ప్రజలు రూ.80 వేలు వెచ్చించి ఓ కొండెంగను కొనుక్కువచ్చారు. అయితే అక్కడి విప్లవ ఆలోచనలను ఒంటబట్టింìచుకున్న కోతులన్నీ కలిసి.. ఆ కొండెంగనే తరిమికొట్టాయి. దీంతో కొండెంగ కోసం వెచ్చించిన రూ.80 వేలు వృథా అయ్యాయి. అదే అడవుల్లో ఫల వృక్షాలు పెంచితే కోతులు ఊళ్లలోకే రావు..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement