30 నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ | Constable training from 30 | Sakshi
Sakshi News home page

30 నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ

Published Wed, Apr 26 2017 12:44 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

30 నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ - Sakshi

30 నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి ఈ నెల 30 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. సివిల్‌/ ఏఆర్, టీఎస్‌ఎస్పీ, ఫైర్‌మన్, ఎస్పీ ఎఫ్‌ ఇలా ఆయా విభాగాల వారీగా ఎంపికైన కానిస్టేబుళ్లు సంబంధిత ప్రధాన కార్యాలయాల్లో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు రిపోర్ట్‌ చేయాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య సూచించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎంపికైన కానిస్టేబుళ్ల వివరాలను http://www.cyberabadpolice. gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

విధివిధానాలు ఇలా...
► ప్రతి ట్రైనీ కానిస్టేబుల్‌ రెండేసి చొప్పున ఖాకీ నిక్కర్లు, కట్‌ బనియన్లు వెంట తెచ్చుకోవాలి.
► దుప్పట్లను శిక్షణ కేంద్రంలో ఇస్తారు. దిండ్లు, బకెట్లు, మగ్గు, బూట్‌పాలిష్, తాళాలు వెంట తెచ్చుకోవాలి.
► భోజనం, ఇతర చార్జీల కింద రూ.6 వేలు డిపాజిట్‌ చేయాలి. భోజనం చార్జీలు తర్వాత తిరిగి ఇస్తారు.
► బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లను శిక్షణ కేంద్రానికి తీసుకురావొద్దు.
► ఆధార్‌ కార్డు, 10 పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాలి.
► కుటుంబసభ్యుల్ని శిక్షణ కేంద్రంలోకి అనుమతించరు.
► హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసిన అనంతరం ట్రైనీ కానిస్టేబుల్స్‌ని డీటీసీ/పీటీసీ/టీఎస్‌పీఏకు పంపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement