
డిప్యూటీ కమాండర్ శ్యాం నివాస్ మృతి
హైదరాబాద్: 20 రోజుల క్రితం చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కమాండర్ శ్యాం నివాస్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ ఆస్పత్రికి చేరుకుని ఆయన మృతదే హానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ శ్యాం నివాస్ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల కృషి చే శారన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు.