
మరీ విడ్డూరం పాటలు..
ఈ రోజుల్లో వస్తున్న పాటలు అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయని, కొన్ని మరీ విడ్డూరంగా ఉంటున్నాయని బాలీవుడ్ ‘డిస్కో’బ్రాండ్ సంగీత దర్శకుడు బప్పీ లహిరి వ్యాఖ్యానిస్తున్నాడు.
‘చార్ బాటిల్ వోడ్కా..’ వంటి పాటలు బొత్తిగా విడ్డూరంగా ఉంటున్నాయని, వాటిలో ఏమాత్రం అర్థం పర్థం ఉండటం లేదని అంటున్నాడు. బాలీవుడ్ స్వర్ణయుగంలో అర్థవంతమైన పాటలు వచ్చాయని, ఇప్పుడలాంటి పాటలు మచ్చుకైనా ఉండటం లేదని వాపోతున్నాడు.