దుబాయ్ కొలువులకు రంగం సిద్ధం | Dubai is set to employ | Sakshi
Sakshi News home page

దుబాయ్ కొలువులకు రంగం సిద్ధం

Published Tue, Mar 29 2016 5:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

దుబాయ్ కొలువులకు రంగం సిద్ధం

దుబాయ్ కొలువులకు రంగం సిద్ధం

♦ 250 పోస్టుల కోసం టామ్‌కామ్ ప్రకటన
♦ హైదరాబాద్, నిజామాబాద్‌లలో ఎంపిక కేంద్రాలు
♦ మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు అభ్యర్థుల ఎంపిక
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు దుబాయ్‌లో కొలువులు ఇప్పించేందుకు రంగం సిద్ధమైంది. పలు విభాగాల్లో 250 మందికి ఉద్యోగాలిప్పించేందుకు తెలంగాణ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) సోమవారం ప్రకటన వెలువరిం చింది. ఇటీవల దుబాయ్‌లోని పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్‌కామ్ ఒప్పం దం చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ముఖ్యంగా ఉత్తరతెలంగాణ జిల్లాల్లోని చాలామంది దుబాయ్‌లో ఉపాధి కోసం దళారులను ఆశ్రయించి మోసపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. దీంతో వాటిని అరికట్టేందుకు టామ్‌కామ్ ఉద్యోగాలిప్పిం చేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా 750మందికి ఉద్యోగాలకోసం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడతలో 250 మందిని దుబాయ్‌కి పంపించాలని నిర్ణయించింది.

 డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లకు అవకాశం..
 మొదటి విడతలో ఉద్యోగాల కోసం ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, సహాయకులను టామ్‌కామ్ ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ఎంపికకు హైదరాబాద్, నిజామాబాద్‌లో రెండు కేంద్రాలను ఎంపిక చేసింది. మార్చి 30, 31 తేదీల్లో హైదరాబాద్‌లోని ఐటీఐ మల్లేపల్లి క్యాంపస్‌లో ఉన్న టామ్‌కామ్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1న నిజామాబాద్‌లోని సంజీవనగర్‌లో ఉన్న ఐటీఐ క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు తమ వెంట పదో తరగతి సర్టిఫికెట్, ఐటీఐ లేదా అనుబంధ పత్రాలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఒరిజినల్ పాస్‌పోర్ట్, రెండు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాలని టామ్‌కామ్ సూచించింది.

Advertisement
Advertisement