శివార్లకు దసరా కానుక! | Dussehra gift to the suburbs | Sakshi
Sakshi News home page

శివార్లకు దసరా కానుక!

Published Wed, Oct 21 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

శివార్లకు  దసరా కానుక!

శివార్లకు దసరా కానుక!

మంచినీటి పథకాలకు మోక్షం
పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ  ఉత్తర్వులు జారీ
తీరనున్న 30 లక్షల మంది దాహార్తి
 

సిటీబ్యూరో: శివారు మున్సిపల్ సర్కిళ్ల దాహార్తి తీర్చే పథకాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గ్రేటర్‌లో విలీనమైన 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వందలాది కాలనీలు, బస్తీల్లో నివసిస్తున్న 30 లక్షల మంది దాహార్తి త్వరలో తీరనుంది. సుమారు రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో ఆయా ప్రాంతాల్లో మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, నీటిసరఫరా పైప్‌లైన్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం విజయదశమి కానుకగా పరిపాలనపరమైన ఉత్తర్వులు జారీచేసింది. ఈ పనులకు చేసే వ్యయంలో రూ.1700 కోట్లు హడ్కో సంస్థ రుణంగా మంజూరు చేయనుంది. మరో రూ.200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయనుంది. త్వరలో ఈ పనులకు టెండర్లు పిలిచి ఏడాదిలోగా పనులు పూర్తిచేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోందని ఎండీ జనార్ధన్‌రెడ్డి, ఈఎన్‌సీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డిలు ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకంలో భాగంగా తీవ్ర దాహార్తితో అలమటిస్తున్న ప్రాంతాల్లో 53 స్టోరేజి రిజర్వాయర్లు, 280 కి.మీ మార్గంలో ప్రధాన నీటి సరఫరా పైప్‌లైన్లు, మరో 2575 కి.మీ మార్గంలో నీటి పంపిణీ లైన్లను ఏర్పాటు చేయనున్నారు.
 
మున్సిపాల్టీల వారీగా దాహార్తిని తీర్చే పథకాల స్వరూపం ఇదే..

 
 కాప్రా

మొత్తం అంచనా వ్యయం రూ.215 కోట్లు
రిజర్వాయర్లు:6, ఓయూటీకాలనీ(7ఎంఎంల్),గోపాల్‌రెడ్డినగర్(2ఎంఎల్),రాధికాటాకీస్(7ఎంఎల్),ఈసీఐఎల్(7.5ఎంఎల్),కైలాస్‌గిరీ(5ఎంఎల్),స్నేహపురి(6.5ఎంఎంల్).
 ప్రధాన పైపులైన్లు(పెద్దవి):27 కి.మీ, నీటి పంపిణీ పైప్‌లైన్లు:209 కి.మీ
 
 ఎల్‌బీ నగర్

అంచనా వ్యయం:రూ.285 కోట్లు
రిజర్వాయర్లు:9,ఎన్‌టీఆర్‌నగర్(9ఎంఎల్),వాసవీనగర్(5ఎంఎల్),హయత్‌నగర్(3ఎంఎల్),రైతుబజార్(3ఎంఎల్),సచివాలయనగర్(2ఎంఎల్),ప్రశాంత్‌నగర్(2ఎంఎల్),వైదేహీనగర్(3ఎంఎల్),సాహెబ్‌నగర్(10ఎంఎల్),వైశాలీనగర్(3ఎంఎల్).
పెద్ద పైప్‌లైన్లు:13.69 కి.మీ,పంపిణీ
లైన్లు:341 కి.మీ
 
ఉప్పల్
అంచనా వ్యయం:రూ.160 కోట్లు
రిజర్వాయర్లు:4,హబ్సిగూడా(15ఎంఎల్),చిలుకానగర్(1ఎంఎల్),ఎన్‌జీఆర్‌ఐ
(1ఎంఎల్),గోఖలేనగర్(1ఎంఎల్)
పెద్ద పైపులైన్లు:13.27 కి.మీ,
నీటి పంపిణీలైన్లు:131 కి.మీ
 
 కూకట్‌పల్లి
అంచనా వ్యయం:రూ.290 కోట్లు
రిజర్వాయర్లు:8,హైదర్‌నగర్(14ఎంఎల్),ఎల్లమ్మబండ(7ఎంఎల్),హుడాపార్క్(3.5ఎంఎల్),కెపిహెచ్‌బి(2.5ఎంఎల్),మున్సిపల్ ఆఫీస్(4.5ఎంఎల్),బోరబండ(5ఎంఎల్),బాలానగర్(11ఎంఎల్),హస్మత్‌పేట్(6.5ఎంఎల్)
ప్రధాన పంపిణీలైన్లు:37.5 కి.మీ,
నీటి పంపిణీ లైన్లు:118 కి.మీ
 
శేరిలింగంపల్లి
అంచనా వ్యయం:రూ.290 కోట్లు
రిజర్వాయర్లు:6,దీప్తిశ్రీనగర్(6ఎంఎల్),హఫీజ్‌పేట్(2ఎంఎల్),హెచ్‌సీయూ(8ఎంఎల్),కొండాపూర్(2ఎఎంల్),విజ్ఞాన్‌విద్యాలయ(1ఎంఎల్),ఐఐటీ(1ఎంఎల్)
పెద్ద,చిన్న పైపులైన్లు:595 కి.మీ
 
రామచంద్రాపురం

అంచనా వ్యయం:రూ.60 కోట్లు
పెద్ద,చిన్న పైపులైన్లు:60 కి.మీ
 
 పటాన్‌చెరు

అంచనా వ్యయం:రూ.70 కోట్లు
ప్రధాన రిజర్వాయర్:ఎంబీఆర్‌జోన్  (15ఎంఎల్)
నీటిపంపిణీ పైపులైన్లు:81 కి.మీ
 
కుత్భుల్లాపూర్
అంచనా వ్యయం:రూ.220 కోట్లు
రిజర్వాయర్లు:6,సూరారం(7.5ఎంఎల్),పేట్‌బషీరాబాద్(3.5ఎంఎల్),
చింతల్(5.5ఎంఎల్),షాపూర్‌నగర్(6ఎంఎల్),జగద్గిరిగుట్ట(7ఎంఎల్),గాజులరామారం(2ఎంఎల్)ప్రధాన పైపులైన్లు:18 కి.మీ,
చిన్నపైపులైన్లు: 254.5 కి.మీ
 
 రాజేంద్రనగర్
అంచనావ్యయం:80 కోట్లు
రిజర్వాయర్లు:2,టీఎన్‌జీఓకాలనీ దుర్గానగర్(5ఎంఎల్),హుడామధుబన్‌కాలనీ(5ఎంఎల్)
ప్రధాన పైపులైన్లు:10.5 కి.మీ
పంపినీలైన్లు:68.75 కి.మీ 

అల్వాల్
 అంచనా వ్యయం:రూ.190 కోట్లు
 2ఎంఎల్),కౌకూర్(2ఎంఎల్),యాదమ్మనగర్(4ఎంఎల్),యాప్రాల్(2ఎంఎల్).
ప్రధాన పైపులైన్లు:29 కి.మీ
నీటి పంపినీలైన్లు:230 కి.మీ
 
 గడ్డిఅన్నారం
అంచనా వ్యయం:రూ.40 కోట్లు
రిజర్వాయర్లు:గడ్డిఅన్నారం(6.5ఎంఎల్)
ప్రధాన పైపులైన్లు:3.5కి.మీ
నీటి పంపిణీ లైన్లు:27 కి.మీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement