ఇక విద్యుత్ చార్జీల వడ్డన!
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి వివిధ డిస్కంలు మంగళవారం నాడు తమ ప్రతిపాదనలు ఇవ్వనున్నాయి. ఏప్రిల్ నెల నుంచి విద్యుత్ చార్జీలను పెంచే అవకాశం కనిపిస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు ప్రతిపాదిస్తున్నాయి.
ఇందులో గృహ వినియోగదారుల మీద తక్కువ భారం మోపి.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై కొంత ఎక్కువ భారం మోపాలని ప్రతిపాదిస్తున్నారు. వీటిని ఈఆర్‌సీ చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.