30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం | english can speak fluently in 30 days | Sakshi
Sakshi News home page

30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం

Published Fri, May 20 2016 2:35 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

english can speak fluently in 30 days

- సాక్షి ఎడ్జ్, పనాచె సంయుక్త ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 30 రోజుల పాటు సాగే స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో పలు అంశాలపై విస్తృతంగా తర్ఫీదు ఇస్తారు. ఆంగ్లంలో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛారణ తదితర  అంశాలను నేర్పిస్తారు.
 
 జూన్ 1న ప్రారంభమయ్యే ఈ కోర్సు రోజుకు 2 బ్యాచ్‌ల చొప్పున శిక్షణ సాగుతుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. పరిమిత సంఖ్యలో సీట్లు గల ఈ కోర్సు ఫీజు రూ. 4,600. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600 నంబర్లలోగాని, sakshiedge@gmail.com మెయిల్ ద్వారాగాని, సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్‌లో చిరునామాలోగాని సంప్రదించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement