హైదరాబాద్ : సీపీఐ సీనియర్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జని నారాయణరావు (90) అనారోగ్యంతో కన్నుమూశారు. ఎల్బీనగర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మరణించారు. కాగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూనే ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుముశారు. ఉజ్జిని నారాయణరావు వరుసగా మునుగోడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మృతిపట్ల సీపీఐ పార్టీ సంతాపం తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.