ఎగుమతుల పెంపునకు ప్రత్యేక వ్యూహం | Exclusive strategy for export growth | Sakshi
Sakshi News home page

ఎగుమతుల పెంపునకు ప్రత్యేక వ్యూహం

Published Sat, Apr 14 2018 2:22 AM | Last Updated on Sat, Apr 14 2018 2:22 AM

Exclusive strategy for export growth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగుమతుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకోవాలని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా సూచించారు. రాష్ట్ర ఎగుమతుల పెంపుపై శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షాసమావేశంలో రీయా టియోటియా పాల్గొన్నారు. ఫార్మా, ఐటీలతోపాటు మరిన్ని రంగాలకు ఎగుమతులను విస్తరించాలన్నారు.

ఎగుమతులకున్న అవకాశాలను, పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నారు. తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులవారీగా సమీక్షించారు. ఎగ్‌ పౌడర్, ఎసెన్షియల్‌ ఆయి ల్స్, మీట్, బియ్యం, టెక్స్‌టైల్స్, కాటన్‌ ఎగుమతులపై చర్చించారు.  కేంద్ర వాణిజ్య శాఖ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించటానికి నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ నుండి ఐటీ, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులలో ప్రముఖపాత్ర పోషిస్తున్నామని జోషి వివరించారు. పర్యాటకం, మెడికల్‌ టూరిజం, సర్వీసెస్, హాస్పిటాలిటీ లాంటి రంగాల నుంచి ఎగుమతుల పెంపునకు కృషి చేస్తామని అన్నారు. దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 30 శాతం తెలంగాణలో తయారవుతున్నాయని, ఎగుమతుల్లో 20 శా తం ఇక్కణ్నుంచే జరుగుతున్నాయని చెప్పారు.  

ప్రభుత్వ పాలసీలు భేష్‌
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అగ్రిపాలసీ, లాజిస్టిక్‌ పాలసీ బాగున్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రియో టియోటియా అభిప్రాయపడ్డారు. అధికారులతో సమీక్ష అనం తరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రెండు శాతం ఉన్న ఎగుమతులు ఏడాది చివరికల్లా 5 శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. జీఎస్టీపై కొంతమంది వ్యాపారుల్లో నిరాసక్తత ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement