సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫీజుల పెంపుపై అధికారుల కమిటీ సిఫార్సులను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుం ది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై 15 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. సోమవారం సచి వాలయంలో ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రైవేట్ కాలేజీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు నరేందర్‌రెడ్డి, జగదీశ్వర్, సతీశ్, వాసుదేవారెడ్డి, సత్యనారాయణ, ప్రభాకర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీలకు రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకు, సీఈసీ, ఎంఈసీలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజులు పెంచాలని ప్రతిని ధులు కోరారు. జూనియర్ కాలేజీలకు ఏ, బీ, సీ, డీ గ్రేడింగ్ ఇచ్చి, పనితీరు, ఫలితాల ప్రాతిపదికన ఫీజును ఖరారు చేస్తే ఎలా ఉంటుందని కమిటీలోని అధికారులు ప్రస్తావించారు. అయితే అన్ని కాలేజీలకు ఒకేలా ఫీజులు పెంచాలని ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫీజు పెంపు!
Published Tue, Jul 26 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
Advertisement