మహావీర్ చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం | fire accident in Mahaveer footwear shop | Sakshi
Sakshi News home page

మహావీర్ చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం

Published Fri, Apr 18 2014 10:27 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in Mahaveer footwear shop

హైదరాబాద్ : హైదరాబాద్లో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహావీర్ చెప్పులు దుకాణంలో నుంచి  మంటలు రేగాయి.  దుకాణంలో నుంచి  మంటలు ఎగిసిపడుతుండటంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు ఆందోళనకు గురై పరుగులు పెట్టారు.

 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక  సిబ్బంది రంగంలోకి దిగడంతో  పెను ప్రమాదం తప్పింది. 8 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ..ప్రమాదానికి కారణాలేంటో తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement