
ఫుడ్ లవర్స్
కల్చర్, హిస్టరీతో పాటు ఫుడ్ అండ్ ఫుడ్ లవర్స్‌కి కేరాఫ్ సిటీ భాగ్యనగరం. హైదరాబాదీ బిర్యానీ, హలీం లాంటి వరల్డ్ ఫేమస్ ఫుడ్స్ వునకే సొంతం.
కల్చర్, హిస్టరీతో పాటు ఫుడ్ అండ్ ఫుడ్ లవర్స్‌కి కేరాఫ్ సిటీ భాగ్యనగరం. హైదరాబాదీ బిర్యానీ, హలీం లాంటి వరల్డ్ ఫేమస్ ఫుడ్స్ వునకే సొంతం. అందుకే హైదరాబాదీలే కాదు, నగరానికి వచ్చిన అతిథులూ ఇక్కడి వంటకాలు ఒక్కసారి రుచి చూస్తే వురి వదలరు. కానీ హైదరాబాద్‌తో దోస్తీ చెయ్యడానికి కొత్తగా వచ్చిన విద్యార్థులకు, ఉద్యోగులకు, కుటుంబాల వారికి ఇక్కడి రుచులన్నింటితో పాటు ఫేమస్ ఫుడ్ స్పాట్‌ల గురించి తెలియాలంటే ఎలా..! ఇదే ఆలోచనతో హెచ్‌సీయుూ స్టూడెంట్స్ ఫేస్‌బుక్‌లో ‘హైదరాబాద్ ఫుడీస్ గ్రూప్’ ప్రారంభించారు.
2012 బెన్నీ, కేసీ గ్యాబీ హైదరాబాద్ వర్సిటీలో చదివేందుకు నగరానికి వచ్చారు. వారికి నగరం చాలా కొత్త. నగరంలో ఎక్కడ ఎలాంటి రుచులు లభ్యమవుతాయో బొత్తిగా తెలియదు. అప్పుడు యూనివర్సిటీలో స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఈ క్లబ్‌ని స్టార్ట్ చేశారు. తర్వాత బయట వాళ్లు కూడా ఈ గ్రూప్‌లో జాయిన్ అవుతూ ఉండటంతో ఈ క్లబ్‌ని విస్తరించారు. ఇప్పుడు దీనిలో 15,000కి పైగా మెంబర్స్ ఉన్నారు. వీరు రోడ్డు పక్కన బళ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటల్స్ వరకు ఎక్కడైనా మీటప్స్ నిర్వహిస్తారు. రుచికరమైన ఆహారానికే
ప్రాధాన్యంకానీ ప్లేస్‌కి కాదు. ఈ మీటప్ గురించిన వివరాలు ఫేస్‌బుక్ పేజ్‌లో పెట్టిన తర్వాత ఒక 40 మంది దాకా ఈ మీటప్‌లో పాల్గొనవచ్చు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో ఫేస్‌బుక్‌లో తమ ఆసక్తిని తెలపవచ్చు.
ఇప్పటికి 150 ఈవెంట్లు
హైదరాబాద్ ఫుడీస్ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమ్యూనిటీ ఇది. ఇక్కడ ఫుడ్ గురించి తప్ప ఏది మాట్లాడినా తప్పే అంటారు ఈ క్లబ్ నిర్వాహకులు. క్లబ్ ప్రారంభించిన రెండున్నరేళ్లలో 150 ఈవెంట్‌లు నిర్వహించారు. ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తున్న విషయం సోషల్ మీడియా ద్వారా గ్రూప్ మెంబర్స్‌కి తెలియజేస్తారు. ఈవెంట్‌లో ఫుడ్ మెనూ, మెంబర్స్ కోసం అందిస్తున్న స్పెషల్ ఫుడ్ వివరాలు కూడా తెలియజేస్తారు. కేవలం ఫుడ్ తినడం ఆనందించటమే కాదు, అనేక చారిటీ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తుంటారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక ఆహారం అందించడం, అనాథ ఆశ్రమం పిల్లల కోసం ఆహారం వండి పెట్టడం, రెస్టారెంట్స్‌కి తీసుకువెళ్లటం లాంటి యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు. ఫుడ్ రెసిపీస్, ఫుడ్ గురించిన చర్చలు, ఫుడ్ స్పాట్స్ ఇలా ఫుడ్ గురించిన ఏ ఆసక్తికర అంశమైనా ఈ గ్రూప్‌తో షేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ గ్రూప్ అనేక రెస్టారెంట్లు, రుచులు టేస్ట్ చేయటం చూసి ఇప్పుడు చాలా మంది హోటల్ వాళ్లే ఈ గ్రూప్ వారిని పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు. మీరు ఫుడ్ లవర్ అయితే, హైదరాబాద్ ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఫేస్‌బుక్ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలు. మీరు సోలో అయినా, ఫ్యామిలీ అయినా సరే ఈ క్లబ్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు అసలు ఫుడ్ అంటే ఇష్టమైన వారు ఎవరైనా ఈ ఠీఠీఠీ.జ్చఛ్ఛిఛౌౌజు.ఛిౌఝ/జటౌఠఞట/జిడఛ్ఛీట్చఛ్చఛీజౌౌఛీజ్ఛీటఛిఠఛ లింక్ ద్వారా గ్రూప్‌లో మెంబర్స్ కావచ్చు.
ఓ మధు
ఈ క్లబ్‌లో వున్న 15 వేల మంది గ్రూప్‌లో ప్రతి మెంబర్‌కి హైదరాబాద్ ఫుడ్ గురించి ఆసక్తి, నాలెడ్జ్ బాగా ఉన్నారుు. ఈ గ్రూప్‌లో రెస్టారెంట్ ఓనర్స్, మేనెజర్స్ కూడా మెంబర్స్‌గా వున్నారు. విదేశాల్లో, వివిధ నగరాలకు చెందిన వారు కూడా క్లబ్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూ లోకల్ ఫుడ్‌ని టేస్ట్ చేస్తుంటారు. ఎవరికైనా, ఎప్పుడైనా, హైదరాబాద్‌లో ఎలాంటి రుచి గురించిన సమాచారం కావాలన్నా ఈ క్లబ్‌లో ఒక చిన్న క్వెరీ పెడితే చాలు. నిమిషాల్లో వివరాలు తెలిసిపోతాయి.
- సంకల్ప్ ఫేస్‌బుక్‌పేజ్ గ్రూప్ అడ్మిన్
ఈ గ్రూప్ ద్వారా ఒకేసారి 30, 40 మంది ఫుడ్ స్పాట్ విజిట్ చేస్తుండటంతో, నిర్వాహకులు ఈ గ్రూప్‌కి డిస్కౌంట్ ధరల్లో చక్కటి భోజనం సర్వ్ చేయటమే కాకుండా ప్రత్యేక అతిథి మర్యాదలుచేస్తుంటారు. ఈ ఈవెంట్స్ ద్వారా కొత్త వ్యక్తులను కలవటం, నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చెయ్యటం మెంబర్‌గా మరువలేని అనుభూతిని కల్పిస్తుంది.
- హర్షిత్, ట్విట్టర్ గ్రూప్ అడ్మిన్