
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలశాఖలో విభజనకు ముందున్న ఇంజనీర్ల సీనియార్టీ జాబితాను తమకు ఇవ్వాలని కోరిన ఆంధ్రప్రదేశ్ వినతిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఉమ్మడి జాబితాను అనుభవమున్న అధికారి ద్వారా వీలైనంత త్వరగా ఏపీ జలవనరుల శాఖకు అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి శాఖ ఈఎన్సీ(అడ్మిన్)కు శుక్రవారం మెమో జారీ చేశారు. ఏపీకి పంపే జాబితాను ప్రభుత్వానికి సైతం సమర్పించాలని సూచించారు. ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment