అరకిలో బంగారు ఆభరణాలు చోరీ | Half kg gold jewellery robbed | Sakshi
Sakshi News home page

అరకిలో బంగారు ఆభరణాలు చోరీ

Published Fri, Jul 8 2016 5:47 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

Half kg gold jewellery robbed

హైదరాబాద్‌ : పాత బోయినపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. రాజేష్ కుమార్ అనే నగల వ్యాపారి ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి సుమారు అర కిలో బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఓ శుభకార్యం నిమిత్తం రాజేష్ కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఇంట్లో దాచిన నగలు మాయమయ్యాయి.

రాజేష్‌కు ఓ జ్యువెలరీ షాపు ఉంది. ప్రతీ రోజూ నగలను ఇంటిలో దాచి వెళ్తుండటం గమనించి ఈ పనికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనాస్థలానికి డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ బృందాలను తెప్పించి ఆధారాలు సేకరిస్తోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement