'అనవసర రాద్ధాంతం చేస్తున్నారు'
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఆ పార్టీ నాయకులు పెదవి కూడా విప్పలేదని ఆరోపించారు. భావితరాలకు నీరు ఇవ్వాలని తాము ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రంగారెడ్డి జిల్లాలో 24 వేల ఎకరాలు అవసరమయితే 24 ఎకరాలు కూడా సేకరించలేదని ఆరోపించారు.
లైడార్ సర్వే తర్వాత ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 26 కోట్లు అని తెలిపారు. తక్కుల లిఫ్టుల సాయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హరీశ్ రావు హామీయిచ్చారు.