మండుతున్న తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ నిప్పుల కొలిమిలా మండుతోంది. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ఇప్పటివరకు 35మంది మృతి చెందారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్నమరో ఐదు రోజుల వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశముంది.
రానున్నమరో రెండు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం రాష్ట్ర వాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సమాచారాన్ని తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ లో నమోదైంది. మండుతున్న ఎండలు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు ముందుగానే ఈనెల 16 నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.