హైకోర్టులో గవర్నర్ అధికారాలపై పిటిషన్ కొట్టివేత | High Court dismisses petition to the governor's power | Sakshi
Sakshi News home page

హైకోర్టులో గవర్నర్ అధికారాలపై పిటిషన్ కొట్టివేత

Published Thu, Aug 14 2014 2:39 PM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

హైకోర్టులో గవర్నర్ అధికారాలపై పిటిషన్ కొట్టివేత - Sakshi

హైకోర్టులో గవర్నర్ అధికారాలపై పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: హైదరాబాద్‌పై గవర్నర్ అధికారాలను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాలు గవర్నర్కు అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఈ రాష్ట్రానికి చెందిన వారు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఈ అధికారాలను సవాల్ చేస్తూ న్యాయవాది గంధం మోహన్‌రావు హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. అయితే దానిని ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా దాఖలు చేయాలని కోర్టు పిటిషనర్‌కు సూచించింది.  పిటిషన్ను మోహన్‌రావు  ఉపసంహరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement