
అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్డీఏ పరిధిలోని తాడికొండ గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల తీరును తప్పుబట్టింది. వెంటనే ఇళ్ల కూల్చివేతలను ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది.
గుంటూరు ఆర్డీఓ రికార్డులతో 15 రోజుల్లో హైకోర్టుకు హాజరుకావాలని సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.