సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించినందున శుక్ర, శనివారాల్లో జరగాల్సిన ఇంటర్మీడియెట్ అర్ధ వార్షిక పరీక్షలను వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్ గురువారం తెలిపారు. సోమవారం నుంచి ప్రతిరోజూ రెండు పరీక్షల చొప్పున నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి యథావిధిగా దసరా సెలవులు ఉంటాయని తెలిపారు.