వైఎస్సార్‌సీపీ యూత్ కమిటీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా తిరుపతయ్య, గంగాధర్, హనుమంతురెడ్డి, సిరి రవి.. కార్యదర్శిగా దుబ్బాక సంపత్, జీహెచ్‌ఎంసీ యూత్ ప్రధాన కార్యదర్శిగా మన్నెం సుధాకరరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడిగా వందాల సతీశ్ నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్ ఆధ్వర్యంలో నియామకాలు జరిగినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్‌సీపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా బందెల వినోద్‌కుమార్ నియమితులయ్యారని పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ తెలిపారు.