కవాడిగూడ: కాపుల రిజర్వేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లో కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా శనివారం జరగనున్న ఏపీ బంద్‌కు ఆలిండియా కాపు జేఏసీ తెలంగాణ కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కాపులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కాపు నేత ముద్రగడ చేస్తున్న దీక్షలను భగ్నం చేసిన ఏపీ ప్రభుత్వం అమానుషంగా అరెస్టు చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. లోయర్ ట్యాంక్‌బండ్ అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం కార్యాలయంలో పలు కాపు సంఘాలు శుక్రవారం రాత్రి ప్రత్యేక సమావేశం అయ్యాయి. కార్యక్రమంలో ఆలిండియా కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్, కన్వీనర్ కటారి అప్పారావు, అఖిల భారత తెలగ, కాపు, బలిజ సంఘం అధ్యక్షులు ఎంహెచ్ రావు, ప్రధాన కార్యదర్శి అద్దెపల్లి శ్రీధర్ పాల్గొన్నారు.
ముద్రగడ అరెస్టుకు నిరసనగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శనివారం నుంచి రిలే నిరాహర దీక్షలు చేయాలని భావించావుని, దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారని జనార్దన్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు బయటవ్యక్తులు రావద్దంటూ ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో కాపు జాగృతి నాయకులు గాళ్ల సతీష్ రిట్ వేసినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నగరంలో నిర్వహిస్తామన్నారు. శనివారం ఉదయం ట్యాంక్‌బండ్ బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
కాపు ఉద్యమానికి మద్దతుగా నిరసనలు
Published Sat, Jun 11 2016 12:08 AM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
Advertisement