హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. గణేషుడి చుట్టు ఏర్పాటు చేసిన బారీ కేడ్లను ఆదివారం రాత్రి తొలగించారు. ఖైరతాబాద్ గణపతి లడ్డూను తీసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. లడ్డూ తీసిన తర్వాత ప్రత్యేకంగా ముస్తాబు చేసిన వాహనంపై మహా గణపతిని ఉంచేందుకు 5 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది.
మరోవైపు ట్యాంక్ బండ్ పైన వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ నిధానంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి, కాబట్టి మిగతా విగ్రహాల నిమజ్జనం పూర్తయితేనే ర్యాలీకి పోలీసు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది.