
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పెద్దమొత్తంలో బకాయి పడటంతో ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమవుతోందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.600 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవటంతో చాలా ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందటం లేదని తెలిపారు.
ఈనెల 22 నాటికల్లా బకాయిలు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని ఆస్పత్రులు హెచ్చరించినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను సరిగ్గా అందేలా చూడాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రచారం కోసం రోజుకో కొత్త పథకాన్ని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీని మాత్రం నిర్వీర్యం చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment