కుటుంబ సంపాదనను విరాళమిస్తున్నారా? | Krishna Sagar Rao commented over KCR | Sakshi
Sakshi News home page

కుటుంబ సంపాదనను విరాళమిస్తున్నారా?

Published Sun, May 21 2017 2:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

కుటుంబ సంపాదనను విరాళమిస్తున్నారా? - Sakshi

కుటుంబ సంపాదనను విరాళమిస్తున్నారా?

పోలీసులకు రూ.500 కోట్లు బహుమతిస్తామన్న సీఎం ప్రకటనపై బీజేపీ
సాక్షి, హైదరాబాద్‌: పోలీసు వ్యవస్థ గౌరవం, ఔన్నత్యాన్ని తగ్గించేలా సీఎం కేసీఆర్‌ వ్యవహ రిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమ ర్శించారు. పోలీసులకు రూ.500కోట్లను బహు మానం ఇస్తామని సీఎం ప్రకటించడంపై మాట్లా డుతూ.. తమ కుటుంబ సంపాదనను కేసీఆర్‌ విరా ళంగా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

శనివారం కృష్ణసాగర్‌ విలేకరులతో మాట్లాడారు. పోలీసుల గౌరవం తగ్గించేలా సీఎం సమా వేశం సాగిందని, ఆ వ్యవస్థ అంతర్గత అంశాలను సీఎం బహిరంగ ప్రదర్శ నకు పెట్టడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్న హోంశాఖ, క్రైం విభాగ సమావేశాల పేర్లను మార్చాలని కేసీఆర్‌ ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉగ్రవాదులు విరుచుకుపడితే సీఎం, రాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement