మద్యానికి డబ్బివ్వలేదని యాసిడ్ తాగాడు | Man drinks bathroom cleaning acid | Sakshi
Sakshi News home page

మద్యానికి డబ్బివ్వలేదని యాసిడ్ తాగాడు

Published Fri, Apr 24 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

మద్యానికి డబ్బివ్వలేదని యాసిడ్ తాగాడు

మద్యానికి డబ్బివ్వలేదని యాసిడ్ తాగాడు

హైదరాబాద్ : మద్యానికి బానిసైన ఓ వక్తి తాగడానికి డబ్బు ఇవ్వలేదని యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సయ్య కథనం ప్రకారం... మల్లాపూర్ బ్రహ్మపురి కాలనీకి చెందిన బి.గోపాల్ (60) మద్యానికి బానిసయ్యాడు.

శుక్రవారం మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడగ్గా... అందుకు వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన గోపాల్ బాత్‌రూంలోకి వెళ్లి క్లీనింగ్ యాసిడ్ తాగాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న గోపాల్‌ను నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement