
నెల్లూరులో రేపు నిషిత్ అంత్యక్రియలు
హైదరాబాద్ : మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతదేహానికి అపోలో మెడికల్ కళాశాలలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు...దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం భౌతికకాయాన్ని నెల్లూరు తరలించనున్నట్లు తెలుస్తోంది. రేపు నెల్లూరులో నిషిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్...అపోలో, ఉస్మానియా వైద్య నిపుణులు, అధికారులతో మాట్లాడారు. ఈ విషాద సమయంలో మంత్రి నారాయణ కుటుంబసభ్యులకు బాసటగా నిలిచేందుకు కామినేని శ్రీనివాస్ నెల్లూరు బయల్దేరారు. లండన్ పర్యటనలో ఉన్న నారాయణ చెన్నై వచ్చి అక్కడ నుంచి నెల్లూరు చేరుకుంటారు.