
ఈసీఐఎల్‌ను సందర్శించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)ను కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్‌తో కలసి శనివారం సందర్శించారు. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈసీఐఎల్‌ను సందర్శించినట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంస్థ ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.