సాక్షి, హైదరాబాద్: డీజీపీని నియమించుకునే అధికారం రాష్ట్రానికే కల్పిస్తూ కొత్త పోలీసు చట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆదివారం మండలి బిల్లును ఆమోదించింది. సీఎం కేసీఆర్ తరపున మంత్రి కె.తారక రామారావు సభలో బిల్లును ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం–1977ను సవరించే బిల్లును ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
వీటితో పాటు తెలంగాణ విద్య, వృత్తిదారుల రిజిస్ట్రేషన్ చట్టం–1968 ను సవరించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రవేశ పెట్టిన బిల్లును, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది. తెలంగాణ న్యాయవాదుల గుమాస్తాల సంక్షేమ నిధి చట్టం–1992ను, తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం–1987లను సవరించేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పెట్టిన రెండు బిల్లులను సభ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment