చాంద్రాయణగుట్ట: పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. ఉప్పుగూడ అరుంధతి కాలనీకి చెందిన ఎల్లయ్య కూతురు శివనీల (19) అదే ప్రాంతంలో ఉన్న శ్రీసాయి క్లినిక్‌లో నర్సుగా పని చేస్త్తోంది. కాగా, ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు క్ల్లినిక్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణేష్ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.
ఆస్పత్రికని వెళ్లి... నర్సు అదృశ్యం
Published Wed, Apr 20 2016 6:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement