దక్షిణ మధ్య రైల్వే సీసీఎంగా పాపిరెడ్డి | papireddy is become south central railway ccm | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వే సీసీఎంగా పాపిరెడ్డి

Published Fri, Jan 29 2016 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

papireddy is become south central railway ccm

సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (సీసీఎం)గా ఎం.పాపిరెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయిల్‌ఫెడ్ ఎండీగా పనిచేశారు. 1985 బ్యాచ్ ఐఆర్‌టీఎస్ అధికారి అయిన పాపిరెడ్డి, గుంతకల్ డివిజన్ అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, గుంటూరు డివిజన్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేశారు. సింగరేణిలో చీఫ్ మార్కెటింగ్ అధికారిగా, ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా, నెడ్‌కాప్ వీసీ అండ్ ఎండీగా, ఉద్యాన శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement