మట్టి గణపతులు సిద్ధం
హెచ్‌ఎండీఏ సరఫరా
విక్రయాలు ప్రారంభించిన బీపీపీ
వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ప్రతిష్ఠించే మట్టి వినాయక ప్రతిమలను 50శాతం రాయితీపై అందించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. నగరంలోని హెచ్‌ఎండీఏ పార్కుల్లో మట్టి వినాయక విగ్రహాల విక్రయాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పండుగ రోజు ఇళ్లలో పూజకు వినియోగించే 8 అంగుళాల మట్టి గణపతి ధర రూ.13, మండపాల్లో ప్రతిష్ఠించే 3 అడుగుల పెద్ద విగ్రహాన్నిరూ.1250కు రాయితీపై భక్తులకు విక్రయిస్తున్నట్లు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్‌డీ వి.కృష్ణ తెలిపారు. నగరంలో ఎక్కువగా డిమాండ్ ఉండే 8 అంగుళాల చిన్న సైజ్ మట్టి గణేశ్ ప్రతిమలు 30వేలు, మండపాల్లో ప్రతిష్ఠించేందుకు 3 అడుగుల పెద్ద విగ్రహాలు 150వరకు విక్రయానికి సిద్ధం చేసినట్టు వివరించారు. ప్రత్యేకించి పూజకు వినియోగించే 8 అంగుళాల చిన్న విగ్రహాలను లుంబినీ పార్కులోని లేజర్ షో కాంప్లెక్స్ వద్ద, హెచ్‌ఎండీఏ పార్కుల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు...
చెరువులు, ఇతర జలాశయాలు కలుషితం కాకుండా పరిరక్షించేందుకు మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హెచ్‌ఎండీఏ తనవంతు కృషి చేస్తోందని ఓఎస్‌డీవి.కృష్ణ తెలిపారు.
ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా రూ.6 లక్షలు కేటాయించి, మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయించినట్లు పేర్కొన్నారు. పెద్ద విగ్రహాల వల్ల చెరువుల్లో పూడిక పేరుకుపోతోందన్న ఉద్దేశంతో వాటి ఎత్తును గత ఏడాది నుంచి 3 అడుగులకే పరిమితం చేసినట్లు ఆయన వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానే మట్టి గణపతులను మండపాల్లో నెలకొల్పేందుకు నగర వాసులు ముందుకు రావాలని ఓఎస్‌డీ పిలుపునిచ్చారు.
మట్టి గణేశులను విక్రయించే ప్రాంతాలు
పంపిణీ కేంద్రం {పాంతం
రాజీవ్‌గాంధీ పార్కు, ఎల్‌ఐజీ పార్కు వనస్థలిపురం
ప్రియదర్శిని పార్కు సరూర్‌నగర్
సఫిల్‌గూడ లేక్ పార్కు సఫిల్‌గూడ మెల్కొటే పార్కు నారాయణగూడ
చిన్నతాళ్లకుంట పార్కు అత్తాపూర్
పటేల్‌కుంట పార్కు కూకట్‌పల్లి
దుర్గం చెరువు హైటెక్ సిటీ
సంజీవయ్య పార్కు నెక్లెస్ రోడ్