కంగ్రాట్స్ సింధు..! సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు సంబరాలు | PV Sindhu selected for arjun award, Celebrations in St. ann's college students | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్ సింధు..! సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు సంబరాలు

Published Wed, Aug 14 2013 2:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

కంగ్రాట్స్ సింధు..!  సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు సంబరాలు

కంగ్రాట్స్ సింధు..! సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు సంబరాలు

భారత ప్రభుత్వం క్రీడాకారులకు అందించే ప్రఖ్యాత పురస్కారమైన అర్జున అవార్డుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఎంపిక కావడంతో ఆమె విద్యనభ్యసిస్తున్న మెహిదీపట్నంలోని సెయింట్‌ఆన్స్ కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సంబరాల్లో మునిగితేలారు. మంగళవారం కళాశాలలోని నోటీస్‌బోర్డులో ఉన్న ఆమె పేపర్ క్లిప్పింగ్స్‌పై ‘కంగ్రాట్స్ సింధు..’, ‘గ్రేట్ సింధు..’, ‘వెల్డన్ సింధు..’ అంటూ రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమకు గర్వకారణంగా ఉందని వారివారి అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
 - మెహిదీపట్నం, న్యూస్‌లైన్

రోల్ మోడల్...   సింధు ఇన్ని ఘనతలు సాధించి మాలాంటి వారికి రోల్ మోడల్‌గా నిలిచింది. నా స్నేహితురాలే ఇన్ని ఘనతలు సాధించిందా అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. తన ప్రతిభకు భారత ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం సంతోషకరం. ఆమె నా స్నేహితురాలు కావడం గర్వంగా ఉంది.
 - సౌమ్య, సహ విద్యార్థి

ప్రతిభకు చక్కటి గుర్తింపు... సింధు ప్రతిభకు భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో గుర్తింపునిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కళాశాలకు చెందిన విద్యార్థి కావడం మాకు గర్వకారణం. చిన్న వయసులో ఎంతో ఎత్తుకు ఎదిగిన సింధూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని  ఆశిస్తున్నా. మరిన్ని విజయాలు అందుకునేందుకు నా వంతు సహకారం అందిస్తా.
- డాక్టర్, సిస్టర్ ఆంథోనమ్మ, ప్రిన్సిపాల్, సెయింట్ ఆన్స్ కళాశాల.

క్రమశిక్షణతోనే... సింధు ఇటు చదువులో, అటు క్రీడల్లో ఎంతో క్రమశిక్షణతో మెలుగుతోంది. గర్వం లేకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ తన పని తాను చేసుకుంటుంది. నిన్న ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం నేడు అర్జున అవార్డుకు ఎంపిక కావడంతో చాలా ఆనందంగా ఉంది. ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
 - విమలారెడ్డి, ఫిజికల్ డెరైక్టర్
 
ఫుల్ హ్యాపీ... సింధుతో నేను కళాశాలకు వచ్చిన ప్రతిసారీ బ్యాడ్మింటన్ ఆడుతా. బ్యాడ్మింటన్‌కు సంబంధించిన విషయాలు చర్చించడంతో పాటు సరదా కబుర్లు చెప్పుకుంటాం. ప్రపంచ ఛాంపియన్ టోర్నమెంట్‌కు వెళ్లేప్పుడు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పి పతకం కొట్టాలని కోరా.  పతకం సాధించడంతో చాలా సంతోషించా. అంతేకాకుండా అర్జున అవార్డుకు ఎంపిక కావడం మరింత ఆనందం కలిగించింది.   
 - ముకుంజోత్ కౌర్, సహ విద్యార్థి.
 
సింధును అభినందించిన మంత్రి ..2013 అర్జున అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్న బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు రాష్ట్ర వుంత్రి వట్టి వసంత కువూర్ అభినందనలు తెలిపారు. దేశం గర్వించేలా భవిష్యత్తులో వురిన్ని విజయూలు సాధించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వుంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయున కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement