హైదరాబాద్: ఆక్రమణలకు గురైన భూముల క్రమబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా 500 గజాల వరకు ఆక్రమిత భూములను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు సబ్ కమిటీ తెలిపింది.
100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అయితే, 2014 డిసెంబర్ 31వరకు ఆక్రమణలో ఉన్న భూములకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ మేరకు వచ్చే ఏపీ కేబినెట్ సమావేశానికి సబ్ కమిటీ క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలు అందజేయనుంది.