సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ కోసం అందించే విత్తన సబ్సిడీ కోసం రూ.224 కోట్లు ఖర్చు కానుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 3.3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కంపెనీలు సరఫరా చేస్తాయి. వాటిలో సోయా బీన్ విత్తనాలు 2 లక్షల క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు లక్ష క్వింటాళ్లు, మిగిలిన వాటిలో జనపనార, పిల్లిపెసర విత్తనాలున్నాయి. సోయాబీన్ క్వింటా విక్రయ ధర రూ.5,800గా ఖరారు చేశారు.
దానికి 37 శాతం ప్రకారం రూ.2,146 సబ్సిడీ అందనుంది. ఇక జీలుగ విత్తనాల విక్రయ ధర క్వింటాలుకు రూ.7,100 కాగా, 65% సబ్సిడీ కింద రూ.4,615 నిర్ధారించారు. జనపనార విక్రయ ధర క్వింటాలుకు రూ.8 వేలు. దానికి 65 శాతం సబ్సిడీ ప్రకటించారు. ఇక పిల్లిపెసర విక్రయ ధర క్వింటాలుకు రూ.13,500. రైతులకు 65% సబ్సిడీతో రూ.4,725కి విక్రయిస్తారు. సబ్సిడీ ఇచ్చేందుకు సోయాబీన్‌కు రూ.116 కోట్లు, జీలుగ విత్తనాలకు రూ.71 కోట్లు, జనపనారకు రూ.24 కోట్లు, పిల్లిపెసరకు రూ.13.50 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment