30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌ | sakshi edge spoken english course announced for students | Sakshi
Sakshi News home page

30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌

Published Fri, Oct 28 2016 4:22 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌ - Sakshi

30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌

హైదరాబాద్‌: కేవలం 30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడగలిగే సామర్థ్యం సొంతం చేసుకునేందుకు సాక్షి ‘ఎడ్జ్‌’ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సును అందిస్తోంది. విద్యా సంబంధ విషయాల్లో సాక్షి ఎడ్జ్‌ వ్యక్తిగతమైన, వృత్తి సంబంధిత అభివృద్ధికి బాటలు వేసే శిక్షణ అందించడంలో అగ్రగామి సంస్థగా పేరొందింది.

సాక్షి ఎడ్జ్‌లోని ప్రభావవంతమైన, విలక్షణమైన శిక్షణా పద్ధతులు.. నేర్చుకునేందుకు అనువైన, చక్కని ప్రేరణ కలిగించే వాతావరణాన్ని ఏర్పరచి, శిక్షణ కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ పూర్తి పరిజ్ఞానాన్ని అందించి విజయం వైపు నడిపిస్తాయి. ప్రపంచ భాష ఇంగ్లిష్‌తో పరి చయం, ఇంగ్లిష్‌లో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ–లిం కింగ్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని అనవసర భయాలను అధిగమించడం, వాయిస్‌–యాక్సెంట్, ముఖ్యమైన గ్రామర్‌ వం టి ఆరు అంశాలతో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సును రూపొందించారు. 2016 నవంబర్‌ 8న ఈ కోర్సు ప్రారంభం కానుంది. తరగతులు ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతాయి.

కోర్సు ఫీజు రూ. 4,600. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 96035 33300 నంబర్‌లో లేదా sakshiedge@gmail.com మెయిల్‌లో సంప్రదించాలి. సాక్షి ఎడ్జ్, 8–2–696, కార్మెల్‌ పాయింట్, రోడ్‌ నంబర్‌ 12, హైదరాబాద్‌–34 అడ్రస్‌లో నేరుగా సంప్రదించవచ్చు. పరిమిత సంఖ్యలో సీట్లు గల ఈ కోర్సు రిజిస్ట్రేషన్లు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement