సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదిం చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్న శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లుయెన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. తరగతులు 22వ తేదీ (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి.
కాలపరిమితి: ఆగస్టు 22వ తేదీ నుంచి 30 రోజుల పాటు
వేళలు: సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటల వరకు
కోర్సు ఫీజు: రూ.4,600
రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షిటవర్స్,రోడ్ నం.1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్
వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300లో (ఉదయం10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు.