
శ్రీమంతుడి దోసె.. చాలా కాస్ట్‌లీ గురూ...!
హైదరాబాద్ : శ్రీమంతుడు సినిమా పేరు విన్నారు..చూశారు. కానీ శ్రీమంతుడి దోసె చూశారా? రుచి చూశారా? నూతనంగా ఏర్పాటైన కారంపొడి రెస్టారెంట్ ఈ శ్రీమంతుడు దోసెని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెస్టారెంట్ను ఫిలింనగర్ రోడ్ నెం.1లో శుక్రవారం ప్రారంభించారు.
శ్రీమంతుడి దోసె ధర రూ.670 ఉంటుందని నిర్వాహకులు శ్యామ్ జంపాల తెలిపారు. బొమ్మిడాల పులుసు, రాగి సంగటి, నాటు కోడి పులుసు, భాగమతి మసాలా పప్పు, జొన్న రొట్టె, నెయ్యి అన్నం ప్రత్యేక రుచులతో అందజేస్తున్నారు.