హైదరాబాద్ : హెచ్సీయూలో విద్యార్థి రోహిత్ మరణం తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి వెల్లడించారు. శనివారం యూనివర్శిటీలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరాన్ని ఎస్ జైపాల్రెడ్డి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్రెడ్డి జస్టిస్ సుదర్శన్రెడ్డి సందర్శించారు.
యూనిర్శిటీలో దళితుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని జైపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ విద్యార్థులను సంఘ విద్రోహుల్లా చిత్రీకరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో దళితులకు చట్ట రక్షణ కల్పించాలని టి. జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
టీఆర్ఎస్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ యూనివర్శిటీ ఘటనపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ... యూనివర్శిటీలో దళితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోహిత్ మరణం పై కేంద్రం వ్యవహారించిన తీరు బాధాకరమని జస్టిస్ సుదర్శన్రెడ్డి అన్నారు.