‘భూముల రీసర్వేపై అఖిలపక్షం నిర్వహించాలి’
సాక్షి, హైదరాబాద్: భూముల రీసర్వే మార్గదర్శ కాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ జీవో 39ని రద్దు చేయాలన్నారు. భూముల సర్వేకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. రైతులకు రూ. 8 వేల పథకాన్ని, భూరికార్డులను సరిచేసే ప్రక్రియను లింక్ చేయడం సరికాదన్నారు.
రికార్డులను సరిచేయాలని, సర్వే నంబర్ల విషయంలోనూ సమగ్రంగా అధ్య యనం జరగాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిపుణులతో చర్చించాలన్నారు. గ్రామసభ లను నిర్వీర్యం చేయకుండా, సమగ్రమైన పరి శోధన తర్వాత రికార్డులు, భూసర్వే చేయాల న్నారు. అప్పటివరకు సాదా బైనామాలను క్రమ బద్ధీకరించాలని కోరారు. భూముల రికార్డుల ఆధునీకరణ నిర్ణయం యూపీఏ హయాంలో తీసుకున్నదేనన్నారు.