‘ఎన్‌సీటీఈ అక్రెడిటేషన్ తప్పనిసరి’ అన్యాయం
మండలి నుంచి గుర్తింపు ఉన్న విద్యా సంస్థలు కూడా విధిగా అక్రెడిటేషన్ పొందాలని, మండలి వెబ్‌సైట్‌తో అనుసంధానం కావాలంటే ఒక్కో విద్యా సంస్థ రూ.లక్షన్నర రుసుం చెల్లించాలంటూ ఆర్థిక భారం మోపడం అన్యాయమని ఉపాధ్యాయ విద్యా సంస్థల తరఫు న్యాయవాదులు వాదించారు. మండలి గుర్తింపు ఉన్న విద్యా సంస్థలపై ఈ విధమైన ఆర్థిక భారం వేయడం తగదని, పిటిషనర్లకు చెందిన విద్యా సంస్థలకు మండలి నుంచి గుర్తింపు ఉందని, 2014లో తెచ్చిన నిబంధనల్లో తప్పనిసరి చేయని అక్రెడి టేషన్ పొందాలని తాజాగా అమల్లోకి తేవడం చెల్లదని చెప్పారు.
అక్రెడిటేషన్ ఉండాలనే నూతన నిబంధనను సుప్రీం కోర్టుకు జస్టిస్ వర్మ కమిటీ సమర్పించిన నివేదికలో పొందుపర్చిందని మండలి స్టాండింగ్ కౌన్సిల్ కె.రమాకాంత్‌రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న తమ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున అప్పటి వరకూ ఈ కేసు విచారణ జరపరాదని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.