కేసీఆర్ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్తగా టీఆర్ఎస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కాసేపట్లో గవర్నర్ నరసింహన్ను కలిసే అవకాశముంది.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు విషయంపై కేసీఆర్ సన్నిహితులతో చర్చించారని, దీనికి సంబంధించి కసరత్తు పూర్తిచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రుల సమర్థతపై వచ్చిన ఫిర్యాదులను, అవినీతి ఆరోపణలను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది.