► తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బిల్లులు..
► లెక్క తేల్చిన తెలంగాణ ట్రాన్‌సకో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన విద్యుత్ బిల్లుల బాకాయిలను సర్దుబాటు చేసిన తర్వాత ఏపీ నుంచి తమకే రూ.881 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని తెలంగాణ విద్యుత్ సంస్థలు లెక్కతేల్చాయి. తెలంగాణ నుంచి రూ.4,282 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేయడంలో వాస్తవం లేదని పేర్కొంటున్నాయి. బకాయిలను చెల్లించకపోతే తెలంగాణకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇటీవల జరిగిన దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తమకే రూ.881 కోట్ల బాకాయిలు రావాల్సి ఉందని తాజాగా తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ధారించాయి.
ఏపీ నుంచి రూ.3,287 కోట్లు రావాలి
విభజన చట్టంలో జరిపిన విద్యుత్ కేటాయింపుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని జెన్‌కో విద్యుదుత్పత్తి ప్లాంట్ల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ పంపకాలు జరుగుతున్నాయి. పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల సర్దుబాటు తర్వా త తమకు రూ.4,282కోట్ల బిల్లులను తెలం గాణ చెల్లించాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య కేవలం విద్యుత్ బకాయిలను మాత్రమే సర్దుబాటు చేస్తే ఏపీకి తెలంగాణ రూ.2,407 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉం టుందని టీ-ట్రాన్‌సకో స్పష్టం చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు ఇతర పద్దుల కింద మొత్తం రూ.3,287 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.
సంయుక్త కమిటీ
విద్యుత్ బకాయిల సమస్య పరి ష్కారం కోసం రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలంగాణ ట్రాన్‌స కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలతోపాటు ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలపై పరిశీలించి సమస్య పరిష్కరించే అంశం పై ఏపీ జెన్‌కో సీఎండీ అజయ్ జైన్ సానుకూలత వ్యక్తం చేశారన్నారు. చర్చలతో సమస్య పరిష్కారమవుతందన్నారు.
ఏపీనే రూ.881 కోట్లివ్వాలి!
Published Tue, Nov 8 2016 1:58 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement