తెలంగాణలో సబ్‌ప్లాన్ అమలు అధ్వానం
కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపట్ల కేంద్ర సామాజిక న్యాయ, సాధికా రత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం నగరా నికి వచ్చిన ఆయన హోటల్ హరితప్లాజాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాందాస్ అథవాలే మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది రూ.10,484 కోట్లు కేటా యించగా, ఇప్పటివరకు 60 శాతం నిధులను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించే విషయంలోనూ అసం తృప్తి వ్యక్తం చేశారు.
సీఎం చైర్మన్‌గా ఏర్పా టైన కమిటీ మూడు నెలలకోసారి సమావే శమై కేసులను సమీక్షించాల్సి ఉండగా, ఈ ఏడాది ఒక్కటి కూడా జరగలేదన్నారు. 2015లో 1,689.. 2016లో 1,904 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఎస్సీల హత్య కేసులకు సంబంధించి 2015లో 39, 2016లో 42 హత్య కేసులు నమోదైనట్లు తెలిపారు. అట్రాసిటీ కేసుల విష యంలో తెలంగాణ దేశంలో తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. కులాంతర వివాహం చేసుకున్న జంటకు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ నుంచి రూ.2.50 లక్షల ప్రోత్సాహకాన్ని కేంద్రం అందిస్తోందని చెప్పారు.
తెలంగాణకు సంబంధించి 2015లో సంబంధించి 850 కులాంతర వివాహాలు నమోదు కాగా, 2016లో 251 నమోదయ్యా యన్నారు. రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వమిస్తున్న పారి తోషికం(రూ.50వేలు) తక్కువగా ఉందని, రాజస్థాన్ ప్రభుత్వం మాదిరిగా రూ.5 లక్షల పారితోషికం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాల కోసం అమలు చేస్తున్న మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీ గురుకుల విద్యాలయాల ఏర్పాటు, విదేశీ విద్యా పథకాలను మంత్రి ప్రశంసించారు.