చెట్టు నుంచి నీటి చుక్కలు..జనం మొక్కులు | water drops of tree in kutbullapur | Sakshi
Sakshi News home page

చెట్టు నుంచి నీటి చుక్కలు..జనం మొక్కులు

Published Tue, Aug 4 2015 5:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

water drops of tree in kutbullapur

కుత్బుల్లాపూర్: సుచిత్రా ప్రధాన రహదారిలోని విమానపూర్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలోని భారీ మేడిచెట్టు కొమ్మలన్నింటినీ యజమాని ఇటీవల నరికేశారు. అయితే, అక్కడక్కడా ఉన్న మోడుల నుంచి నీటి చుక్కలు పడుతుండడాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. అక్కడే చిన్నపాటి గుడి ఉండటంతో అదంతా దేవుడి మహిమేనని ఆనోటా.. ఈనోటా.. ఆ ప్రాంతంలో వ్యాపించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకోవటం మొదలైంది. జనం మొక్కులు, పూజలు ప్రారంభించటంతో అక్కడి రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement